- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. కూతురితో కలిసి కాలువలో దూకిన తల్లి
మాచర్ల మండలం తాళ్లపల్లి సమీపంలోవిషాద ఘటన జరిగింది. కన్న కూతురిని నడుముకి కట్టుకుని నాగార్జునసాగర్ కుడి కాలువలోకి దూకింది....

దిశ, మాచర్ల: మాచర్ల మండలం తాళ్లపల్లి సమీపంలోవిషాద ఘటన జరిగింది. కన్న కూతురిని నడుముకి కట్టుకుని నాగార్జునసాగర్ కుడి కాలువలోకి దూకింది. ఈ ఘటనపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో విజయపురి సౌత్ ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. కొద్ది సేపటి గాలింపులోనే తల్లి, కూతురు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
మాచర్ల నెహ్రూ నగర్‌కు చెందిన ఆరే శివ కుట్టు మిషన్లు రిపేర్ చేస్తూ జీవిస్తున్నాడు. గురువారం ఉదయం శివ దుర్గి వెళ్ళగానే అతను భార్య అమరలింగేశ్వరీ(25) కూతురు లిదిక (3) కలసి తాళ్లపల్లి సమీపంలోని కుడి కాలవవద్దకు చేరుకున్నారు. అక్కడ కూతురునీ అమర లింగేశ్వరి నడుముకు చున్నీతో కట్టుకొని కాలువలోకి దూకి ఆత్మహత్య పాల్పడింది. సంఘటన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విజయ పూరి సౌత్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో ఇరువురు మృతదేహాలు లభ్యమయ్యాయి. అమరలింగేశ్వరి చిన్న కూతురు యశ్వని మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటినుండి అమలింగేశ్వరి మనోవేదనతో బాధపడుతున్నట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం ఇరువురు మృతదేహాలను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.






