- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో దారుణం.. కోడలు వల్లే అరిష్టాలను ఇంట్లోంచి గెంటేసిన అత్తామామ
పెళ్ళైన రెండో నెల నుంచే ఇంట్లో అరిష్టాలకు కోడలే కారణమని ఆమెను ఇంట్లో నుంచి అత్తామామ గెంటేశారు.

దిశ, వెబ్ డెస్క్ : పెళ్ళైన రెండో నెల నుంచే ఇంట్లో అరిష్టాలకు కోడలే కారణమని ఆమెను ఇంట్లో నుంచి అత్తామామ గెంటేశారు. అంతేకాదు అండగా నిలబడాల్సిన భర్త నల్లగా ఉన్నావని, తనకు అక్కర్లేదని వదిలించుకోవాలని చూసాడు. ఈ అమానవీయ ఘటన పల్నాడు జిల్లా వినుకొండ మండలం తిమ్మాయపాలెంలో జరిగింది. బాధితురాలు గోపి లక్ష్మి వివరాల ప్రకారం.. గత జూన్ లో వినుకొండ పట్టణానికి చెందిన కోటేశ్వరరావుతో వివాహం కాగా.. మూడో నెల నుంచి నల్లగా ఉన్నావని భర్త, నీవల్లే ఇంట్లో అశుభాలంటూ అత్తమామలు వేధింపులకు గురి చేసారని తెలిపింది.
వివాహ సమయంలో రెండు ఎకరాల పొలం అమ్మి రూ.12 లక్షల నగదు, 25 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చినా.. అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేశారని, చివరకు ఇంటి నుంచి బయటకు పంపారని ఆమె వాపోయింది. న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకోగా.. ఆమె ఫిర్యాదు మేరకు భర్తతో పాటు అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలియజేశారు.






