కొడుకు సహా తల్లి ఆత్మహత్య.. ఏం కష్టమొచ్చిందో..?

by Anil Sikha |
కొడుకు సహా తల్లి ఆత్మహత్య.. ఏం కష్టమొచ్చిందో..?
X

దిశ, డైనమిక్ బ్యూరో : కుమారుడి సహా కాలువలో దూకి ఓ మహిళా హోం గార్డ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అనకాపల్లి మండలం తుమ్మపాల వద్ద గల ఏలేరు కెనాల్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. కసింకోట మండలం అట్టా వీధికి చెందిన అట్టా ఝాన్సీ (27) అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తోంది. కుటుంబ కలహాల కారణంగా గత శుక్రవారం తన కొడుకు దినేష్ కార్తీక్(4) ను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. కొడుకుతో పాటు ఏలేరు కెనాల్ లో దూకేసి ఆత్మహత్యకు పాల్పడింది. అనకాపల్లి మండలం తుమ్మపాల వద్ద గల ఏలేరు కెనాల్ లో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. ఝాన్సీ భర్త అచ్యుతరావును పోలీసులు తీసుకొని విచారిస్తున్నారు

Advertisement
Next Story