- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్ తో తల్లీ కొడుకు మృతి
by Thanuru Gopichand |
పొలానికి నీరు పెడుతూ విద్యుత్తు షాక్ తో తల్లీ కొడుకు మృతి చెందిన ఘటన వైయస్సార్ జిల్లా బి. కోడూరు మండలంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది .

X
దిశ, పోరుమామిళ్ల : పొలానికి నీరు పెడుతూ విద్యుత్తు షాక్ తో తల్లీ కొడుకు మృతి చెందిన ఘటన వైయస్సార్ జిల్లా బి. కోడూరు మండలంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది . గుంతపల్లి గ్రామానికి చెందిన కూరాకు జయరాం రెడ్డి(48) గురమ్మ (60) ఉదయం గ్రామ సమీపాన ఉన్న తెలుగు గంగ కాలువలో పొలానికి నీరు అందిస్తున్న సమయంలో మోటారు ఆగిపోయింది. చిన్నపాటి మరమ్మత్తులు చేస్తున్న సమయంలో జయరాం రెడ్డికి విద్యుత్ షాక్కు గురయ్యాడు. అతనిని కాపాడబోయిన తల్లి కూడా విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఒకే గ్రామానికి ఇరువురు చనిపోవడంతో గుంతపల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. బి కోడూరు పోలీసులు సంఘటన చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






