Crime News : వైజాగ్ లో దారుణం.. ప్రేమోన్మాది దాడిలో తల్లీ, కూతురు హతం

by Muthe.Rajitha |   (  Updated:2025-04-02 10:56:59  IST  )

ఏపీ(AP)లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది.

Crime News : వైజాగ్ లో దారుణం.. ప్రేమోన్మాది దాడిలో తల్లీ, కూతురు హతం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదనే కోపంతో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి ఆమె కుటుంబంపై విరుచుకు పడ్డాడు. తల్లీ, కూతురును హతమార్చాడు. ఈ ఘోరం విశాఖపట్నం(Vishakhapanam)లోని మధురవాడలో చోటు చేసుకుంది. మధురవాడలో స్థానికంగా నివాసం ఉంటున్న నవీన్ అనే యువకుడు కొమ్మాది స్వయం కృషి నగర్లో నివాసం ఉంటున్న దీపిక అనే యువతిని తనను ప్రేమించాలని గత కొంతకాలంగా వెంట పడుతున్నాడు. దీనికి ఆ యువతి ససేమిరా అనడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం దీపిక ఇంటికి వెళ్ళి కత్తితో తీవ్రంగా దాడి చేశాడు.

కూతురు హాహాకారాలు విన్న తల్లి లక్ష్మి అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆమెపై కూడా విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన లక్ష్మి అక్కడిక్కడే మృతి చెందింది. ఈ కేకలు విని అక్కడికి చేరుకున్న స్థానికులను కత్తితో బెదిరించి నవీన్ అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కొన ఊపిరితో ఉన్న దీపికను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story