- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amaravathi : అమరావతిలో మరిన్ని భూ కేటాయింపులు
ఏపీ రాజధాని అమరావతిలో మరిన్ని సంస్థలకు భూములు కేటాయించారు.

కేంద్ర సంస్థలు, బ్యాంకులు, బీజేపీ దరఖాస్తులకు ఆమోదం
గెయిల్, అంబికాకు ఇచ్చిన భూములు రద్దు
సమీక్షించి నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గ ఉపసంఘం
వివరాలు వెల్లడించిన మంత్రి పొంగూరు నారాయణ
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ రాజధాని అమరావతిలో మరిన్ని సంస్థలకు భూములు కేటాయించారు. దరఖాస్తు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు పొంగూరు నారాయణ, టీజీ భరత్, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. జూమ్ ద్వారా మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్ హాజరయ్యారు. రాజధానిలో పలు సంస్థలకు భూకేటాయింపులపై వారు చర్చించారు. 16 అంశాల్లో భూ కేటాయింపులపై చర్చించి, 12 అంశాలను ఆమోదించారు. అనంతరం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) మీడియాకు సమావేశ వివరాలను వెల్లడించారు. గెయిల్ ఇండియా లిమిటెడ్, అంబికా దర్బార్ బత్తికి గతంలో ఇచ్చిన భూములను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 2019 కి ముందు 130 మందికి భూములు కేటాయిస్తే వారిలో కొందరే నిర్మాణాలు చేపట్టారని వెల్లడించారు.
రానున్న ఆరు నెలల్లో అన్ని పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. 2014-19 కాలంలో భూములు కేటాయించిన సంస్థల్లో నాలుగింటికి కొనసాగిస్తూ ఆమోదం తెలిపారు. సెంటర్ బ్యూరో ఆఫ్ ఇన్విసిగేషన్ కు రెండు ఎకరాలు కేటాయింపు కొనసాగిస్తూ ఆమోదించారు. జియాలజికల్ ఆఫ్ సర్వే సంస్థకు రెండు ఎకరాలు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు ఐదు ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు మూడు ఎకరాలు కేటాయించామన్నారు. 2014- 19లో కేటాయించిన రెండు సంస్థలకు కేటాయింపులను రద్దు చేసి, కొత్తగా ఆరు సంస్థలకు భూ కేటాయింపులు చేశామని తెలిపారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు రెండు ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంక్ కు రెండు ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు 0.4 ఎకరాలు, ఇంటిలిజెన్స్ బ్యూరో కి 0.5 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కి 0.5 ఎకరాలు, బీజేపీకి రెండు ఎకరాల చొప్పున కేటాయిస్తూ నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
నిర్మాణాలు చేపట్టకపోతే రద్దు చేస్తాం
భూములు పొందిన సంస్థలు టైమ్ లైన్ ప్రకారం నిర్మాణం చేపట్టాలని, లేదంటే భూములు రద్దు చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 2014-2019 కాలంలో 130 సంస్థలకు 1270 ఎకరాలు ఇచ్చామన్నారు. ఈ సంస్థల్లో కొంతమంది మాత్రమే నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వలన మిగిలిన వారు ఎవరు నిర్మాణాలకు ముందుకు రాలేదన్నారు. గత ప్రభుత్వం ఆడిన మూడుముక్కలాటతో అందరూ భయపడి వెనక్కి వెళ్లిపోయారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో అనేక సంస్థలు భూ కేటాయింపులకు దరఖాస్తు చేశాయని తెలిపారు. అందులో 64 సంస్థలకు 884 భూ కేటాయింపులకు చేశామన్నారు. గతంలో కేటాయించిన సంస్థలకు టైం బాండ్ ముగిసిందని, అందుకే నాలుగు నుంచి ఆరు నెలలు సమయం కేటాయించామని తెలిపారు. రాబోయే రెండు మూడు నెలల్లో అన్ని సంస్థలు నిర్మాణాలు చేపట్టనున్నాయని పేర్కొన్నారు. అమరావతిలో పిలిచిన అన్ని టెండర్స్ కు పనులు మొదలైనట్లు తెలిపారు. వచ్చే నెల చివరి నాటికి 20 వేల మంది కార్మికులు పనిచేయటానికి అందుబాటులోకి వస్తారని మంత్రి నారాయణ వివరించారు






