- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లొకేషన్ చేంజ్.. రాజోలు-అమలాపురం మధ్య తీరం దాటనున్న మొంథా
by Muthe.Rajitha |
మొంథా తుఫాను మరో 3 గంటల్లో తీరాన్ని తాకనుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను మరో 3 గంటల్లో తీరాన్ని తాకనుంది. అయితే ముందుగా ఊహించినట్టు కాకినాడకు దక్షిణ తీరంలో కాకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు-అమలాపురం మధ్యలో అంతర్వేది వద్ద, రాత్రి 11.30 తర్వాత తీరాన్ని తాకనుందని APSDMA అధికారులు తాజాగా ప్రకటించారు. తుఫాను తీరం తాకడానికి మరో 3 నుంచి 4 గంటలు పట్టే అవకాశం ఉంది. గడిచిన 6 గంటల్లో 15 కి.మీ వేగంతో కదులుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 90 కి.మీ నుంచి 110కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావంతో ఇప్పటికే కోనసీమ జిల్లా అతలాకుతలం అవుతోంది. తుపాను నేపథ్యంలో కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దుకాణాలు మూసివేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థతోపాటు, ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
Next Story






