PM Modi : శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న మోడీ

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-16 06:32:27  IST  )

కర్నూలు నుండి హెలికాప్టర్‌లో శ్రీశైలం బయలుదేరిన ప్రధాని మోడీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

PM Modi : శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు నుండి హెలికాప్టర్‌లో శ్రీశైలం బయలుదేరిన ప్రధాని మోడీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. మల్లికార్జునస్వామి ఆలయంలో మోడీ రుద్రాభిషేకం చేయగా, భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజ చేశారు. ప్రధానితో పాటు కర్నూలు నుండి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లారు. సున్నిపెంట హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడగా అక్కడ నుండి రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకున్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో ముందస్తుగానే శ్రీశైలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రత సైతం కట్టుదిట్టం చేశారు.

Next Story