- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారిని దర్శించుకున్న మోడీ: సంచలన ట్వీట్ చేసిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు
భారత ప్రధాని నరేంద్రమోడీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో : భారత ప్రధాని నరేంద్రమోడీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ తిరుమల శ్రీవారి దర్శనం నేపథ్యంలో టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఈ మేరకు టీటీడీపై సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం, దాని అనుబంధ ఆలయాల నిర్మాణాలను, ఆస్తులను క్రమ పద్ధతిలో సనాతన అధికారి నాశనం చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీ ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉందని దయచేసి ఆలయాన్ని రక్షించి ఇక్కడ వెంటనే హిందూ రాష్ట్రాన్ని స్థాపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం రాజకీయం సంచలనంగా మారింది.‘గౌరవనీయులైన పీఎంజీ... తిరుమల ఆలయం TTD కింద హిందూ దేవాలయాల పురాతన సంప్రదాయాల నిర్మాణాలు మరియు ఆస్తులను క్రమపద్ధతిలో నాశనం చేస్తున్న సనాతన అధికారి మరియు ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉంది. దయచేసి ఆలయాన్ని రక్షించి ఇక్కడ వెంటనే హిందూ రాష్ట్రాన్ని స్థాపించండి. దేవుడు నిన్ను దీవించును’అంటూ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ట్విట్ చేశారు.






