Chandrababu: దేశాన్ని రక్షించే శక్తి మోడీ

by Thanuru Gopichand |

ఈ దేశాన్ని రక్షించే శక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి (Narendra Modi) ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Chandrababu: దేశాన్ని రక్షించే శక్తి మోడీ
X

టెర్రరిస్టుల దాడులతో దేశం చలించింది

ప్రపంచంలో హింసకు తావు లేదు

ఏపీలోని ఉరవకొండలో సీఎం చంద్రబాబు వెల్లడి

దిశ, డైనమిక్ ​బ్యూరో : ఈ దేశాన్ని రక్షించే శక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి (Narendra Modi) ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం చాయాపురంలో ఇవాళ ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం యుద్ధ వాతావరణంలో ఉందన్నారు. టెర్రరిస్టులు దాడులతో దేశం మొత్తం చలించి పోయిందని చెప్పారు. మన దేశం టెర్రరిజానికి ఎల్లప్పుడూ వ్యతిరేకమన్నారు. పహెల్గాంలో మన వారిని ఇష్టానుసారంగా చంపేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తీవ్రవాదానికి (Terrorism) ప్రపంచంలో చోటు లేదని ప్రధాని మోడీ ఎప్పుడూ చెబుతుంటారని పేర్కొన్నారు. పాకిస్తాన్​మనపైనే దాడులు చేస్తూ కవ్వింపు చర్యలు చేస్తుందని మండిపడ్డారు. దేశం కోసం ఎంతో మంది యువకులు రక్షణ రంగంలోకి వెళుతున్నారని తెలిపారు. అయితే మన తెలుగువాడు మురళీ నాయక్​(Muali Naik)ఉగ్రవాదులతో పోరాటి వీర మరణం పొందడం చాలా బాధ కలిగించిందన్నారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రగాఢ సానుభూతి తెలియజేసినట్లు తెలిపారు. మురళీనాయక్​కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దేశ రక్షణలో సైనికులు ఉండబట్టే ఇక్కడ మనం సంతోషంగా నిద్ర పోగలగుతున్నామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా హింసకు తావు లేదన్నారు. యుద్ధ సమయంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. భారత్​మాతాకీ జై.. అంటూ నినాదాలు చేశారు. వీర మరణం పొందిన మురళీనాయక్​ఆత్మకు శాంతి కలగాలని రెండు నిముషాలు మౌనం పాటించారు.

Next Story