రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాలకు APSDMA హెచ్చరిక

by Naga Rani Yarlagadda |

ఏపీలో రానున్న మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని (AP Weather) విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అంచనా వేసింది. మూడ్రోజులపాటు రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Moderate Rains) కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాలకు APSDMA హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రానున్న మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని (AP Weather) విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అంచనా వేసింది. మూడ్రోజులపాటు రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Moderate Rains) కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం (మే 31) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇప్పటికే రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లను ముంచెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కృష్ణానదిపై నిర్మించిన జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు (Jurala Project) ఇన్ ఫ్లో 60 వేల క్యూసెక్కులు ఉండగా.. స్పిల్ వే ద్వారా 60 వేలు, విద్యుత్ ఉత్పత్తికి 17 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం డ్యామ్ (Srisailam Dam)కు 41 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 821.90 అడుగుల వద్ద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉంది.

Next Story