- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ద్రోణి ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రేపు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: ద్రోణి ప్రభావంతో రేపు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ రోజు రాత్రి విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు కాకినాడ జిల్లా పోలవరంలో 9 సెంటీమీటర్లు, అనకాపల్లిలో 7, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 6.6, కాకినాడ జిల్లా కోటనందూరులో 6.4, నెల్లూరు జిల్లా చినపవానిలో 5.7, అల్లూరి జిల్లా పైనంపాడులో 5.6 సెంటీమీటర్ల వర్షపాతెం నమోదైనట్లు తెలిపింది.






