- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
సోమవారం అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. దీని ప్రభావంతో రానున్న మూడ్రోజుల్లో పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు (Moderate to Heavy Rains) కురిచే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రాష్ట్రంలో పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
సోమవారం అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే మన్యం, అల్లూరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల కర్నూల్, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.






