- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓ వైపు చలి.. మరోవైపు దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాలను వర్షాలు, చలి వణికిస్తున్నాయి. సింగిల్ డిజిట్ టెంపరేచర్లతో తెలంగాణ వాసులు వణికిపోతుండగా.. వర్షాలతో ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, చలికి ప్రజలు వణికిపోతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి వేళల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. రెండు, మూడు చద్దర్లు కప్పుకున్నా చలి ఆగకపోవడంతో.. ఇదెక్కడి చలిరా బాబోయ్ అంటున్నారు. నార్త్, వెస్ట్ తెలంగాణ జిల్లాల్లో 7 నుంచి 9 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతోంది. ఇక హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి, ఉదయం వేళల్లో 8-12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది.
తెలంగాణలో చలి చంపేస్తోంటే.. ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో దక్షిణకోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతిజిల్లాలో తెల్లవారుజాము నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లోఅక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.






