- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Super Idea: మొబైల్ టైలర్ మిషన్.. మెచ్చుకున్న సీఎం చంద్రబాబు
మొబైల్టైలర్షాపు నడుపుతున్న టైలర్కాలేషాకు సీఎం చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు

టైలర్ కాలేషా కు అభినందన
అన్నివిధాలుగా సహకరిస్తానని హామీ
దిశ, డైనమిక్ బ్యూరో : మొబైల్టైలర్షాపు నడుపుతున్న టైలర్కాలేషాకు సీఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu) అభినందనలు తెలిపారు. కృష్ణా జిల్లా పోరంకికి చెందిన కాలేషా ఈ వినూత్న ఆలోచనను అమలు చేస్తున్నారు. మొదట ఆయన దుస్తులు కుట్టే షాపు నడిపేవారు. కస్టమర్లకు షాపు వద్దకు రావడం తగ్గిపోవడంతో ఆయన ఈ ఆలోచన చేసి కస్టమర్ల ఇళ్ల వద్దకే మిషన్సహా వెళ్లి దుస్తులు కుడుతున్నాడు. ఇది సోషల్మీడియాలో వైరల్కావడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మొబైల్ షాపు టైలర్నూతన ఆవిష్కరణ, పట్టుదల, స్ఫూర్తికి నిదర్శనం అన్నారు. టైలర్కాలేషా (Tailor Kalesh) లాగా ప్రతిఒక్కరు సవాళ్లను అవకాశాలనుగా మార్చుకోవాలని సూచించారు. అట్టడుగు వర్గాల నుంచి ఇటువంటి సృజనాత్మక కథలు వింటుంటే ఎంతో స్ఫూర్తిమంతంగా ఉంటుందని తెలిపారు. కాలేషా వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తానని సీఎం చంద్రబాబు ట్విట్టర్లో తెలిపారు. ఈ మేరకు ఈ రోజు ఆయన ట్విట్టర్లో మొబైల్టైలర్వీడియోను (viral vedio) పోస్టు చేశారు. టైలరు ఆ వీడియోలో పలు విషయాలు వెల్లడించారు. ఫోన్చేస్తే ఇంటికి వెళ్లి దుస్తులు కుడతానని చెప్పారు. తనకు మొదట ఓ షాపు ఉండేదన్నారు. అది సరిగా సాగకపోవడంతో ఈ ఆటోచన చేశానన్నారు. తన మొబైల్షాపు మొదట రిక్షాతో మొదలైందన్నారు. రిక్షా తొక్కలేకపోవడంతో ఒక మోటారు ఐస్క్రీం బండిని తీసుకుని దానిని తన వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్నానని ఆయన తెలిపారు. రూ.40 వేలు ఖర్చుపెట్టి ఆ వాహనంపై మిషన్ఏర్పాటు చేశానని అన్నారు. ప్రజల నుంచి కూడా దీనికి మంచి స్పందన వస్తుందని ఆయన తెలిపారు.






