అమరావతిపై మూకుమ్మడి దాడి

by Thanuru Gopichand |   (  Updated:2025-08-19 10:43:42  IST  )

అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు అని హోంమంత్రి అనిత మండిపడ్డారు.

అమరావతిపై మూకుమ్మడి దాడి
X

అమరావతిపై మూకుమ్మడి దాడి

దుష్ప్రచారాలను తిప్పి కొడతా ..

ఫ్యాక్ట్​ ఫైండింగ్​ కమిటీ వేసి కేసులు పెడతాం..

హోం మంత్రి వంగలపూడి అనిత వార్నింగ్​

దిశ డైనమిక్ బ్యూరో : అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు అని హోంమంత్రి అనిత మండిపడ్డారు. వర్షాకాలంలో గుంతల్లోకి నీళ్లు వస్తాయి అని కూడా తెలియదా అని ప్రశ్నించారు. వైసీపీ అనుబంధం మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. సచివాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై ముకుమ్మడిగా దాడి చేస్తున్నారని అన్నారు. అమరావతి మహిళలు ఐదేళ్లపాటు పోరాటం చేశారని గుర్తు చేశారు. అవస్త వాలను వాస్తవాలుగా నేడు కొందరు చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ సొంత మీడియాలో విషయం చిమ్ముతున్నారని అన్నారు. తద్వారా ప్రజల్లో అభద్రతాభావం నింపుతున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారం చేసే వారిపై చర్య లు తీసుకుంటామన్నారు. ప్రజలు గుణపాఠం చెప్పిన వైసీపీ నేతల్లో మార్పు రాలేదని అన్నారు. వైసిపి దుష్ప్రచారం తిప్పికొట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అమరావతిపై లేనిపోని రాతలు రాసే వారిపై కేసులు పెడతా మన్నారు. విజయవాడ మునిగిపోయిందని మరో మీడియా రాసిందన్నారు. ధైర్యం ఉంటే రాజకీయంగా రండి పోరాటం చేద్దాము అని సవాల్ విసిరారు. వారు పెట్టిన పోస్ట్ లపై రాజద్రోహం కేసులు పెట్టాలన్నారు. ప్రకాశం బ్యారేజీలో ఒక చిన్న గేటుకు చిన్న రిపేరు వస్తే రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ప్రకాశం బ్యారేజ్ లో 69 గేట్లు బాగానే పనిచేస్తున్న అని తెలిపారు.

సొంత పేపర్లో రోజుకో నకిలీ వార్త రాస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలు రాయండి మేము కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. అమరావతి అభివృద్ధి చెందడానికి కొందరు ఓర్చుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఆచయా పోస్టులపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. నిజా నిజాలు పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టంగా చెప్పారని అన్నారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం కోరారని తెలిపారు. సోషల్ మీడియా పోస్టులపై లీగల్ చర్యలు తీసుకుంటామన్నారు. అసాంఘిక శక్తులు రౌడీ ముఠాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు.. కూటమి ప్రభుత్వం అని తెలుసుకోవాలన్నారు. అసాంఘిక శక్తులను ఎలా అరికట్టాలో చంద్రబాబుకు బాగా తెలుసు అన్నారు. అసాంఘిక శక్తులు ఎక్కడున్నారో దర్యాప్తు చేస్తున్నామని వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ విషయంలో ఎస్కార్ట్ సిబ్బందిపై చర్యలు ఉంటాయఃన్నారు. శ్రీకాంత్ పెరోల్​ వెనక ఎవరు ఉన్నా చర్యలు తప్పకుండా హెచ్చరించారు. ఆ మహిళ వెనక ఎవరున్నారు అని ఆరా తీస్తున్నామని , వారందరిపై చర్యలు ఉంటాయని తెలిపారు. మాజీ సీఎం జగన్​కొందరిని పెంచి పోషించారని అనిత ఆరోపించారు.

Next Story