‘శంకరాభరణం’లా ‘వీరమల్లు’ను కాపాడుకోవాలి: MLC

by Gantepaka Srikanth |

విశాఖపట్టణంలోని సీతంపేటలో జనసేన పార్టీ(Jana Sena Party) కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ నాగబాబు(Nagababu), ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.

‘శంకరాభరణం’లా ‘వీరమల్లు’ను కాపాడుకోవాలి: MLC
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణంలోని సీతంపేటలో జనసేన పార్టీ(Jana Sena Party) కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ నాగబాబు(Nagababu), ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ అరాచకాలకు తగిన ప్రతిఘటన జరగాలని, జనసేన కూటమి సమన్వయంతో సమర్థవంతంగా పాలన సాగిస్తుందని చెప్పారు. జనసేనలోని ఏ నాయకుడికీ పదవులపై ఆశలు లేవని, కార్యకర్తగా పనిచేయడానికి ఇష్టపడతారని అన్నారు. ఉత్తరాంధ్రలో ప్రతినెలా ఐదు నుండి పది రోజుల పాటు పార్టీ కార్యకర్తల మధ్య ఉంటానని నాగబాబు హామీ ఇచ్చారు. త్వరలో జనసేన సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని, నామినేట్ పదవులు దామాషా ప్రకారమే వస్తాయని తెలిపారు. కావాలనే హరిహర వీరమల్లు చిత్రంపై నెగిటివ్ ప్రచారం చేశారని.. అయినా సినిమాను అడ్డుకోలేకపోయారని అన్నారు. శంకరాభరణం సినిమాకి ప్రోత్సహించినట్టు కొద్ది రోజులు మనం హరిహర వీరమల్లు సినిమా(Harihara Veeramallu Movie)ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, రమేష్ బాబు, కార్పొరేటర్లు, ఇతర నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story