- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేం అధికారంలోకి వస్తే కేసు రీ ఓపెన్ చేస్తాం: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
మేం అధికారంలోకి వస్తే కేసు రీ ఓపెన్ చేస్తామని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హెచ్చరించారు...

దిశ, వెబ్ డెస్క్: తాము అధికారంలోకి వస్తే కేసు రీ ఓపెన్ చేస్తామని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి(Mlc Varudu Kalyani) అన్నారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి(Minister Gummidi Sandhyarani) తనయుడు, పీఏపై ఫిర్యాదు చేసిన యువతిపైనే కేసు నమోదు చేయడంపై ఆమె స్పందించారు. ఈ మేరకు వరుదు కల్యాణి మాట్లాడుతూ మంత్రి సంధ్యారాణి డైరెక్షన్‌లోనే బాధితురాలుపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. అధికారం చేతి ఉంది కదాని మంత్రి, మంత్రి పీఏ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓ మహిళలను మరొక మహిళా మంత్రి ఇబ్బంది పెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు చేస్తే మంత్రి పీఏపై చిన్న కేసు నమోదు చేశారని వ్యాఖ్యానించారు. బాధితురాలకి న్యాయం జరగకపోతే తాము అధికారంలోకి వస్తే నిందితుడికి శిక్ష పడేట్టు చేస్తామని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హెచ్చరించారు.






