- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీఫ్ మినిస్టర్ కాదు... చీటింగ్ మాస్టర్: చంద్రబాబుపై మహిళా ఎమ్మెల్సీ ఫైర్
సీఎం చంద్రబాబు చీఫ్ మినిస్టర్ కాదని, చీటింగ్ మాస్టర్ అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అంటూ మహానాడులో తెలుగుదేశం పార్టీనేతలు, కార్యకర్తలు ఆరోపణలు చేయడంపై ఆమె విరుచుకుపడ్డారు

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu) చీఫ్ మినిస్టర్ కాదని, చీటింగ్ మాస్టర్ అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి(Mlc Varudu Kalyani) అని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)ని గొడ్డలి పార్టీ అంటూ మహానాడు(Mahanadu)లో తెలుగుదేశం పార్టీ(Telugudesam) నేతలు, కార్యకర్తలు ఆరోపణలు చేయడంపై ఆమె విరుచుకుపడ్డారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Former Cm, Ycp Chief Ys Jagan Mohan Reddy) తిట్టడానికే మహానాడు పెట్టారని వరుదు కల్యాణి ఆరోపించారు.
జగన్‌కు ఎదురుగా నిలబడి ధైర్యం తెలుగుదేశం పార్టీ నేతలుకు ఉందా అని వరుదు కల్యాణ్ ప్రశ్నించారు. జగన్ ను తిట్టేందుకే మహానాడు నిర్వహించినట్లుందని వరుదు కల్యాణి విమర్శించారు. తమ బ్రాండ్ సంక్షేమమని, టీడీపీ బ్రాండ్ సంక్షోభమని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బోత్ ఆర్ నాట్ సేమ్ అని హామీల పేరుతో మహిళలను మోసం చేశారని వరుదు కల్యాణి మండిపడ్డారు.






