- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను నాస్తికుడిని కాదు, ప్రౌడ్ సనాతని హిందువును.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు
జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒక సగటు భారతీయుడిని, హిందువుని అని చెప్పారు. తాను పరమాత్మను నమ్ముతానని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒక సగటు భారతీయుడిని, హిందువుని అని చెప్పారు. తాను పరమాత్మను నమ్ముతానని చెప్పారు. హిందువు అనేది నమ్మకమో.. మతమో కాదని ఇది ఒక ధర్మం అని అన్నారు. ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ అని చెప్పారు. ఈ దేశంలో పుట్టిన ప్రతిఒక్కరు హిందువేనని ఇక్కడ చార్వాకులకు కూడా చోటు ఉంది కాబట్టి తాను హిందువునే అని అన్నారు. తన ధర్మాన్ని గౌరవిస్తూ.. ఇతరుల విశ్వాసాలను కించపర్చకుండా బతుకున్నా కాబట్టి ప్రౌడ్ సనాతని హిందువునని చెప్పారు. అందుకే తాను ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టిన తొలిసారే అర్చకుల జీతాలు పెంచాలని కోరినట్టు తెలిపారు.
2020లో అంతర్వేదిలో రథం దగ్ధమైనరోజు రాష్ట్రవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నరోజు వైసీపీ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగిస్తామని చెప్పిందన్నారు. కానీ సీబీఐ ఆ కేసును టేకప్ చేయలేదని చెప్పిందన్నారు. వైసీపీ వాళ్లకు ఇతరుల పర్సనల్ విషయాలపై ఉన్న ఆసక్తి ప్రజలపై ఉండదన్నారు. 2020లోనే రామతీర్థం రాముడి శిరస్సును తీసేసినా వైసీపీ పట్టించుకోలేదన్నారు. ఈ కేసును కూడా నీరుగార్చారన్నారు. 2024 జనవరి 24లో అయోధ్య రామమందిరం నిర్మించుకున్నారని అన్నారు.
ఈ సందర్భంగా పవన్, చంద్రబాబు వెళ్లి అయోధ్యలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. కానీ జగన్ ఒక ట్వీట్ కూడా వేయలేదన్నారు. అంతేకాకుండా టీటీడీలో అకామిడేషన్ ఛార్జీలు పెంచారని సామాన్యుడికి దేవుడిని దూరం చేశారన్నారు. తిరుమలపై దోపిడీ అంతా ఇంతా కాదు అన్నారు. బాధ్యత గురించి వైసీపీ వాళ్లకు చెప్పడం చెవిటోడి ముందు శంఖం ఊదినట్టేనని అన్నారు. పవన్ తిరుమల దర్శనానికి తన కూతురుకు డిక్లరేషన్ ఇప్పించారని, అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చే వెళ్లారని అన్నారు. నువ్వు కలాం కంటే గొప్పోడివా అంటూ జగన్ ను ప్రశ్నించారు. డిక్లరేషన్ అడిగారని తిరుమల పర్యటన రద్దు చేసుకున్న చరిత్ర నీది అంటూ మండిపడ్డారు. కల్తీ నెయ్యి గురించి రేపు మాట్లాడాతనని అన్నారు.






