- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో జనసేన సభ్వత్వ నమోదు.. నాగబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు
పార్టీ సభ్యత్వ నమోదులో ‘సాధక్’ పాత్ర చాలా కీలకమని ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. అనుకున్న మేర సభ్యత్వాలను నమోదు చేయించాలని పార్టీ నేతలకు సూచించారు...

దిశ, వెబ్ డెస్క్: జనసేన సభ్యత్వ నమోదు(Jana Sena membership registration) కార్యక్రమం రాష్ట్రంలో జోరుగా జరుగుతోంది. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు(MLC Konidela Nagababu) ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుస్తున్నారు. క్షేత్రస్థాయిలో సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఇంటికీ జనసేన జెండాను, పవన్ కల్యాణ్ ఆశయాలను చేరవేయడమే తమ లక్ష్యమని ఆయన కార్యకర్తలకు వివరిస్తున్నారు. రాబోయే రోజుల్లో జనసేనకు తిరుగులేని ప్రజా బలాన్ని సమకూర్చే దిశగా నాగబాబు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.
ఈ మేరకు ఆదివారం నాగబాబు విశాఖ(Visakha)లో పర్యటించారు. అక్కడ కూడా సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడడుతూ పార్టీ సభ్యత్వ నమోదులో ‘సాధక్’ పాత్ర చాలా కీలకమని చెప్పారు. అనుకున్న మేర సభ్యత్వాలను నమోదు చేయించాలని పార్టీ నేతలకు నాగబాబు సూచించారు.






