- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలోనే అగ్రగామిగా పవన్ కల్యాణ్ శాఖ.. ఎమ్మెల్సీ నాగబాబు ఫుల్ హ్యాపీ
దేశంలోనే అగ్రగామిగా పని చేస్తూ. గ్రామాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ(Pm Narendra Modi) అండదండలతో సీఎం నారా చంద్రబాబు నాయుడు(Cm Nara Chandrababu Naidu) నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) సహకారంతో ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Finance Minister Payyavula Keshav) ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు(Panchayat Raj and Rural Development) ప్రవేశ పెట్టిన వ్యవసాయ బడ్జెట్ హర్షణీయమని ఎమ్మెల్సీ నాగబాబు(MLC Nagababu) అన్నారు. కూటమి ప్రభుత్వం లక్ష్యాలు, సంక్షేమం, అభివృద్ధికి అస్త్రంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర రెవెన్యూ లోటు క్రమంగా తగ్గిస్తూ మెరుగైన ఫలితాలు సాధించడం చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం మూలధన వ్యయం కేటాయింపులు గణనీయంగా పెంచిందన్నారు. మూలధనం వ్యయం పెంచడం ద్వారా మెరుగైన భవిష్యత్తును అంచనా వేయవచ్చని చెప్పారు. ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనదు అనే భావన గత పాలకులపై ఉంటే, పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అన్న నమ్మకాన్ని రైతుల్లో తీసుకు వచ్చామని పేర్కొన్నారు.
దేశంలోనే అగ్రగామిగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
‘‘పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ దేశంలోనే అగ్రగామిగా పని చేస్తోంది. గ్రామాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధిక ప్రాధాన్యత ఇస్తూ పనులు చేయిస్తున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖకు కేటాయించిన 22,942 కోట్ల రూపాయలతో గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులను ముందుకు తీసుకు వెళ్ళవచ్చు. అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖలకు 714 కోట్లు కేటాయించడం ద్వారా 50 శాతం గ్రీన్ కవర్ లాంటి ప్రాజెక్టులకు ఊతం ఇస్తుంది. పోలవరం ఇతర పెండింగ్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, రైతు సంక్షేమం, రాష్ట్ర ఆర్ధిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్న వ్యవసాయ శాఖకు మునుపెన్నడూ చూడని బడ్జెట్ కేటాయింపులు జరగడం అన్నదాత పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న శ్రద్దను చాటి చెప్పింది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి వైభవం తీసుకు వచ్చేలా, డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాలను అందిపుచ్చుకునేలా భవిష్యత్తు తరాలకు అవకాశాల గనిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ విజన్ అనుసరిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడదామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు పిలుపునిచ్చారు.






