- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News:సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ నాగబాబు.. కారణం ఇదే!
రాష్ట్రం(Andhra Pradesh)లో MLA కోటా MLCగా జనసేన పార్టీ(Janasena Party) ప్రధాన కార్యదర్శి నాగబాబు(Nagababu) ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లో MLA కోటా MLCగా జనసేన పార్టీ(Janasena Party) ప్రధాన కార్యదర్శి నాగబాబు(Nagababu) ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు(బుధవారం) జనసేన నేత కొణిదెల నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు నాగబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదిలా ఉంటే.. సీఎం చంద్రబాబు(CM Chandrababu)ను జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు(MLC nagababu) రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు(బుధవారం) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ కార్యాలయంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నాగబాబు కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబును సీఎం చంద్రబాబు అభినందించారు. సీఎం చంద్రబాబుకు నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం నాగబాబుకు శాలువా కప్పి, వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు.






