- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిఠాపురం కార్యకర్తలతో నాగబాబు భేటీ.. వర్మ వివాదంపై నో రియాక్షన్
కాకినాడ జిల్లా, డిప్యూటీ సీఎం నియోజవర్గం పిఠాపురం జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ నాగబాబు 'మాటామంతి' నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నేతలు, కార్యకర్తలతో ముఖాముఖి చర్చించారు.....

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District), డిప్యూటీ సీఎం నియోజవర్గం పిఠాపురం జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ నాగబాబు(Mlc Nagababu) 'మాటామంతి' నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నేతలు, కార్యకర్తలతో ముఖాముఖి చర్చించారు. దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని సూచించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena Chief Pawan Kalyan) గెలుపులో కీలక పాత్ర పోషించిన కార్యకర్తల శ్రమను ఈ సందర్భంగా నాగబాబు కొనియాడారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.
టీడీపీ నేత వర్మ వివాదంపై...
అయితే నియోజకవర్గంలో ఇటీవల సంచలనం సృష్టించిన టీడీపీ నేత వర్మ వివాదంపై నాగబాబు స్పందించారు. ఆ విషయంపై మాట్లాడేందుకు ఆయన సున్నితంగా నిరాకరించారు. అంతేకాదు మౌనాన్ని ఆశ్రయించారు. ఇది కేవలం జనసేన కార్యకర్తల సంక్షేమం. అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమమని నాగబాబు తెలిపారు. వివాదాల జోలికి వెళ్లకుండా కేవలం పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తూ నాగబాబు వ్యవహరించిన తీరు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.






