- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pithapuram:నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ నాగబాబు
పిఠాపురం(Pithapuram)లో కోలాహలంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: పిఠాపురం(Pithapuram)లో కోలాహలంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) దృష్టి సారించారు. పవన్ కళ్యాణ్ చొరవతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయిన విషయం తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు(MLC Konidela nagababu) పర్యటించారు. ఎమ్మెల్సీగా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వచ్చిన నాగబాబుకు నియోజకవర్గం పార్టీ శ్రేణులు, ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు.
పిఠాపురం, గొల్లప్రోలు మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా బాణసంచా పేలుస్తూ, పూల వర్షం కురిపిస్తూ, జేజేలు పలుకుతూ స్వాగతం పలికారు. ఈ క్రమంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఇందులో భాగంగా రూ. 28.5 లక్షల CSR నిధులతో నిర్మించిన గొల్లప్రోలు మండల నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు.
అనంతరం గొల్లప్రోలు హెడ్ వాటర్ వర్క్స్ లో రూ. 65.24 లక్షలతో మంచినీటి సరఫరా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పంప్ హౌస్ లో మోటార్ల పని తీరును పరిశీలించారు. అనంతరం గొల్లప్రోలు పట్టణంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ని ప్రారంభించారు. క్యాంటిన్‌లో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. నాగబాబుతో పాటు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ కుమార్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు గారు, అధికారులు పాల్గొన్నారు.






