ప్రకృతి ఒడిలో 'వనసేన' స్వచ్ఛ యజ్ఞం: అడవిని శుభ్రం చేసిన నాగబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-23 09:25:20  IST  )

ప్రకృతి పరిరక్షణ అనేది కేవలం నినాదం కాదని, ప్రతి ఒక్కరి ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. ..

ప్రకృతి ఒడిలో వనసేన స్వచ్ఛ యజ్ఞం: అడవిని శుభ్రం చేసిన నాగబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకృతి పరిరక్షణ అనేది కేవలం నినాదం కాదని, ప్రతి ఒక్కరి ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్సీ నాగబాబు(MLC Nagababu) తెలిపారు. 'వనసేన - ప్రకృతిని కాపాడే సేన' ఆధ్వర్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాలభైరవ కోన ఆలయ(Kalabhairava Kona Temple) పరిసరాల్లో విసృతంగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను వనసేన ప్రతినిధుల(Vanasena representatives)తో కలిసి ఆయన శుభ్రం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల(Plastic waste)ను ఏరివేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా నాగబాబు మట్లాడుతూ పవిత్రమైన ఆలయాలు, అటవీ ప్రాంతాలు ప్లాస్టిక్ కాలుష్యంతో పాడైపోతుండటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిని కాపాడుకుంటేనే మానవాళికి మనుగడ ఉంటుందని, వనసేన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించాలని నాగబాబు కోరారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అనే సందేశాన్నిచ్చారు. ప్లాస్టిక్ మహమ్మారిని అరికట్టడం, పరిసరాల పరిశుభ్రతను పాటించడం మన దినచర్యలో భాగంగా మారాలని నాగబాబు పిలుపునిచ్చారు.

Next Story