ఎమ్మెల్సీ వర్సెస్ మండలి చైర్మన్.. డివిజన్ బెంచ్‌కు పంచాయితీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-11 15:42:04  IST  )

ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ రాజీనామా పంచాయితీ డివిజన్ బెంచ్‌కు చేరింది..

ఎమ్మెల్సీ వర్సెస్ మండలి చైర్మన్.. డివిజన్ బెంచ్‌కు పంచాయితీ
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ(MLC Jayamangala Venkataramana) రాజీనామా వ్యవహారం మండలి చైర్మన్ పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే చాలా రోజులుగా రాజీనామాను పెండింగ్‌లో ఉంచడంతో జయమంగళ వెంకట రమణ హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్.. జయమంగళ వెంకట రమణ రాజీనామాపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీంతో డివిజన్ బెంచ్‌ను మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేశారు. ఈ మేరకు తదుపరి విచారణను డివిజన్ బెంచ్‌ ఈ నెల 18కి వాయిదా వేసింది. కాగా వైసీపీ(Ycp) నుంచి జనసేన(Janasena)లో చేరిన జయమంగళ వెంకట రమణ తన రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నారు. అయితే మండలి చైర్మన్ మోషేను రాజు స్పందించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.

Next Story