- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ
ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రాజీనామా విషయంలో ఆయనకు బిగ్ షాక్ తగిలింది. వెంకట రమణ రాజీనామాను శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు..

దిశ,వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ(MLC Jayamangala Venkataramana) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రాజీనామా విషయంలో ఆయనకు బిగ్ షాక్ తగిలింది. వెంకట రమణ రాజీనామాను శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు(Legislative Council Chairman Moshen Raju) తిరస్కరించారు. జయమంగళ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదన్న కారణంతో రాజీనామాను తిరస్కరించినట్లు మోషేన్ రాజు తెలిపారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా పని చేసిన జయమంగళ వెంకటరమణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్‌కు పలుమార్లు లేఖ రాశారు.
అయితే జయమంగళ రాజీనామాపై మోషేన్ రాజు తాత్సారం చేశారు. దీంతో హైకోర్టును వెంకటరమణ ఆశ్రయించారు. ఈ మేరకు జయమంగళ రాజీనామాపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో మోషేన్ రాజు విచారణ చేపట్టి జయమంగళ వివరణ తీసుకున్నారు. అయితే ఈ వివరణ సంతృప్తిగా లేదంటూ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జయమంగళ రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జయమంగళ వెంకటరమణ తదుపరి ఆలోచన ఏ విధంగా ఉంటుందో చూడాలి.






