- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
‘నేను విడాకులు తీసుకుంటా’.. సిట్టింగ్ MLC సంచలన ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: భార్య వాణి, కుమార్తెతో పాటు ఐదుగురు వ్యక్తులు తనపై హత్యాయత్నం చేశారని పోలీసులకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి గేట్లు విరగ్గొట్టి లోపలికి వచ్చి హత్యాయత్నం చేయబోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాణి, ఆమె అనుచరులను అరెస్ట్ చేయాలని పోలీసులను దువ్వాడ కోరారు. అనంతరం దువ్వాడ మీడియాతో మాట్లాడారు. నన్ను రెండేళ్లుగా వేధిస్తున్నారు. నా భార్య నన్ను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నది. నా భార్య, కూతురు నుంచి ప్రాణహాని ఉంది. అధికార పార్టీ అండతోనే నాపై దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే దౌర్జన్యం చేస్తున్నారు. గన్ లైసెన్స్ కోసం ఎస్పీని కోరినా ఇవ్వలేదు. అందుకే తప్పని పరిస్థితుల్లో నా భార్య వాణి, కూతురు హైందవిపై పోలీసులకు ఫిర్యాదు చేశా. నేను వాణి నుంచి విడాకులు తీసుకుంటా’ అని ఎమ్మెల్సీ దువ్వాడ సంచలన ప్రకటన చేశారు. కాగా, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని అక్కవరం సమీపంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆయన ఇంట్లో దివ్వెల మాధుని అనే మహిళతో ఎమ్మెల్సీ వేరు కాపురం పెట్టాడని భార్యా, పిల్లలు ఆరోపణలు చేస్తున్నారు.