- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో బర్త్‌డే సెలబ్రేషన్స్‌పై దుమారం.. క్లారిటీ ఇచ్చిన దువ్వాడ జంట
తిరుమలలో తనూజ పుట్టస్వామి బర్త్ డే వేడుకలు జరపడంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి స్పందించారు. ఇందులో ఆమెకెలాంటి సంబంధం లేదన్నారు.

దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రన్నరప్ గా నిలిచిన తనూజ పుట్టస్వామి ఇటీవల తిరుమలలో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం వివాదానికి దారితీసింది. పవిత్రమైన తిరుమలలో కేక్ కటింగ్ తో బర్త్ డే సెలబ్రేషన్లు చేసుకోవడంపై నెట్టింట తీవ్ర దుమారం రేగింది. దీంతో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. తిరుమలలో బర్త్ డే వేడుకలు జరిపింది వాస్తవమే అయినా.. ఇందులో తనూజకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన బర్త్ డే సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవాలని కోరడంతో తిరుమలకు వెళ్లామన్నారు. అయితే తనూజ తాము తిరుపతి వెళ్లాక.. తన పుట్టినరోజున స్వామివారిని దర్శించుకోవాలని కోరిందని, అందుకే తమతో ప్రొటోకాల్ దర్శనానికి తీసుకెళ్లామన్నారు. అయితే తిరుమలలో కేక్ కట్ చేయకూడదన్న విషయం తమకు తెలియదని, తెలిస్తే ఇలాంటి పనులు చేసి వివాదాల్లో ఇరుక్కునేవాళ్లం కాదన్నారు. దీనికి రాజకీయ రంగు పులిమి కాంట్రవర్సీలోకి లాగొద్దన్నారు. కేక్ కటింగ్ గురించి ఆమెకేమీ తెలియదని, అది ఎగ్ లెస్ కేక్ మాత్రమేనని స్పష్టం చేశారు.






