- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిన్నెల్లి సోదరులపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హాట్ కామెంట్స్
జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులపై (Pinnelli Brothers) ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న (Buddha Venkanna) హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులపై (Pinnelli Brothers) ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న (Buddha Venkanna) హాట్ కామెంట్స్ చేశారు. సోదరులను ఉద్దేశిస్తూ విమర్శల వర్షాన్ని కురిపించారు. పిన్నెల్లి సోదరులు నరహంతకులని ఆరోపించారు. పేద ప్రజలంటే పిన్నెల్లి సోదరులకు చులకన భావన అని పేర్కొన్నారు. వారు చేసిన అరాచకాలకు అంతుపొంతు లేదున్నారు. వైసీపీ హయాంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నారు. పిన్నెల్లి సోదరుల అరాచకాలకు జగన్ దే పూర్తి బాధ్యతని స్పష్టం చేశారు. వారి అరాచకం ఎంతలా ఉందంటే గతంలో తనపైన, బోండా ఉమపైన కూడా దాడులు చేయించారని గుర్తు చేసుకున్నారు. వైసీపీ నేత తురకా కిషోర్ పై హత్యాయత్నం వెనుక కూడా పిన్నెల్లి సోదరులు ఉన్నారని ఆరోపణలు గుప్పించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పిన్నెల్లి సోదరుల అరెస్టులు జరిగాయని స్పష్టం చేశారు. మాజీ సీఎం వైయస్ జగన్ గురించి మాట్లాడుతూ.. జగన్ మళ్లీ సీఎం కావడం కలేనని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన నేరాలు, ఘోరాలు, స్కాములను చూసి ప్రజలు ఆ పార్టీ పట్ల వ్యతిరేకత పెంచుకుంటున్నారని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని.. జగన్ సీఎం అవుతారని కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు.






