తొక్కిసలాట రచ్చ.. ఎమ్మెల్సీ బొత్స సంచలన డిమాండ్

by Vemula.Srinu Prasad |

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన డిమాండ్ చేశారు..

తొక్కిసలాట రచ్చ.. ఎమ్మెల్సీ బొత్స సంచలన డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయం(Kasibugga Venkateswara Swamy Temple)లో తొక్కిసలాట(Stampede) జరిగి 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. భక్తుల రద్దీ(Devotees Rush)కి సంబంధించి ఆలయ నిర్మాహకులు ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Former Minister and MLC Botsa Satyanarayana) సంచలన డిమాండ్ చేశారు. కాశీబుగ్గ ఘటన బాధితులను పరామర్శించిన ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో ఘటన అని గుర్తు చేశారు. తిరుపతి, సింహాచలం ఘటనలో ఎవరిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. భక్తుల రద్దీగా ఉంటే పోలీసులు లేకపోవడం నిర్లక్ష్యం కాదా అని నిలదీశారు. కాశీబుగ్గ ఘటనపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని బొత్స డిమాండ్ చేశారు.

Next Story