ఆయన అంతే.. మన దురదృష్టం: బాబుపై బొత్స సెటైర్లు

by Vemula.Srinu Prasad |

చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు...

ఆయన అంతే.. మన దురదృష్టం: బాబుపై బొత్స సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఎప్పుడు సీఎం అయినా ప్రైవేట్‌.. ప్రైవేట్‌ అంటారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(MLC Botsa Satyanarayana) అన్నారు. పీపీఏ విధానంలోకి మెడికల్ కాలేజీ(Medical College)లను తీసుకురావడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రైవేటు అనే ఆలోచన రావడమే ఈ రాష్ట్రానికి దురదృష్టకరమని విమర్శించారు. రూ.2లకే కిలో బియ్యం ఇచ్చారని ఎన్టీఆర్ మహానుభావుడని అనుకుంటున్నామని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్‌ చేశాడనే వైఎస్సార్‌ను మహానాయకుడని అనుకుంటున్నామన్నారు. కానీ చంద్రబాబు మాత్రం చరిత్ర హీనుడిగా నిలిచిపోతారని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

Next Story