అవును ఈ వయసులో ఎందుకు.?: చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలను సమర్థించిన బొత్స

by Vemula.Srinu Prasad |

చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమర్థించారు...

అవును ఈ వయసులో ఎందుకు.?: చంద్రబాబుపై  జగన్ వ్యాఖ్యలను సమర్థించిన బొత్స
X

దిశ, వెబ్ డెస్క్: అవును ఈ వయసులో చంద్రబాబు(Chandrababu) ఎందుకు అని జగన్ అన్న మాటల్లో తప్పేముందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(MLC Botsa Satyanarayana) అన్నారు. రాజకీయాల్లో కొడుకు లోకేశ్(Lokesh) యాక్టివ్‌గా ఉన్నాడనే ఉద్దేశంతో జగన్ అలా అన్నాడని, అందులో ఎలాంటి తప్పు లేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. వయసు పెరిగిన చంద్రబాబుకు ఇంక రాజకీయాలు ఎందుకు.. ఇంట్లో ఉండి కృష్ణా, రామా అని అనుకోమని జగన్ అన్నారని, ఆ మాటల్లో తప్పేముందని బొత్స ప్రశ్నించారు.

ఇక పులివెందుల ఫలితాలపై స్పందించిన బొత్స.. టీడీపీ నేతలు దౌర్జన్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రజల ఓట్లను కూడా ఆ పార్టీ నాయకులే వేశారని ఆయన ఆరోపించారు. పోలీసులు దగ్గర ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోయారని విమర్శించారు. పులివెందుల గెలుపుపై టీడీపీ నేతల మాటలను చూస్తే నవ్వొస్తుందని తెలిపారు. ఈ నెల 12న ప్రజా స్వామ్యం ఖూనీ అయిందని, ఆ రోజును తాము బ్లాక్ డే‌గా ప్రకటించామన్నారు. ‘‘ఒక జడ్పీటీసీ ఉంటే ఏంటి.?, పోతే ఏంటి..?, అధికారంలో ఉంది కూటమినే కదా. వ్యవస్థకు తూట్లు పొడిచారు. ప్రత్యర్దులపై దాడి చేయడం మంచిది కాదు. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిలో అభద్రత ఉంది’’ అని బొత్స అని వ్యాఖ్యానించారు.

Next Story