MLC Ashok Babu: నిరుద్యోగ నిర్మూలనే కూటమి సర్కార్ లక్ష్యం.. ఎమ్మెల్సీ అశోక్ బాబు

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-12 09:37:04  IST  )

నిరుద్యోగ నిర్మూలనే కుటమి సర్కార్ లక్ష్యమని ఎమ్మెల్సీ అశోక్ బాబు (MLC Ashok Babu) అన్నారు.

MLC Ashok Babu: నిరుద్యోగ నిర్మూలనే కూటమి సర్కార్ లక్ష్యం.. ఎమ్మెల్సీ అశోక్ బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగ నిర్మూలనే కూటమి సర్కార్ లక్ష్యమని ఎమ్మెల్సీ అశోక్ బాబు (MLC Ashok Babu) అన్నారు. ఇవాళ తుమ్మలపల్లి (Thummalapally) కళాక్షేత్రం (Kala Kshethram)లో జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాబోయే మరో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి సర్కార్ పని చేస్తోందని అన్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను రాబట్టేందుకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

దేశానికి యువత ఓ ఆస్తి అని.. మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) ఆధ్వర్యంలో నిరుద్యోగ నిర్మూలనకు కూటమి సర్కార్ కృషి చేస్తోందని అన్నారు. నాడు చంద్రబాబు (Chandrababu) ఐటీ (IT) రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన వారే ఉన్నత పదువుల్లో ఉన్నారని తెలిపారు. స్వామి వివేకానంద (Swamy Vivekananda) స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు పిలుపునిచ్చారు.

Next Story