డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. కోర్టులో హాజరైన అనంతబాబు భార్య

by Naga Rani Yarlagadda |

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య రాజమండ్రి జిల్లా కోర్టులో హాజరయ్యారు.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. కోర్టులో హాజరైన అనంతబాబు భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మమ్యం హత్యకేసులో.. అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ సోమవారం ఉదయం రాజమండ్రి జిల్లా కోర్టులో జడ్జి ముందు హాజరైంది. సుబ్రహ్మణ్యం హత్యకేసులో విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆమె ఇటీవలే సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో అనంతబాబు ఏ1గా ఉండగా.. ఆయన భార్యను ఏ2గా చేర్చారు. 12 రోజుల్లో లక్ష్మీదుర్గను సిట్ అధికారులు 84 గంటలపాటు విచారించారు. మార్చి 16వ తేదీ నుంచి 29 వరకూ ఆమె కాకినాడలో సిట్ విచారణకు హాజరయ్యారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యపై అధికారులు పలు కోణాల్లో విచారించగా.. తెలియదు, గుర్తులేదు, మరచిపోయా అని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె విచారణ నివేదికను సిట్ అధికారులు న్యాయస్థానానికి సమర్పించనున్నారు. ఈ కేసులో ఏ2గా ఉన్న లక్ష్మీదుర్గ కొద్దిరోజులపాటు కనిపించకపోవడంతో.. ఎస్సీ, ఎస్టీకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ అరెస్ట్ వారెంట్ ను రద్దు చేయాల్సిందిగా ఆమె హైకోర్టును ఆశ్రయించగా.. సిట్ విచారణకు కచ్చితంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. దీంతో కాకినాడ డీఎస్పీ, ఐపీఎస్ అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో ఆమె విచారణ జరిగింది.

Next Story