- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసు కస్టడీకి ఎమ్మెల్సీ అనంతబాబు.. కాకినాడ సర్పవరం పీఎస్‌లో విచారణ!
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సాక్షులను బెదిరించిన విషయంలో వైసీపీ కీలక నేత ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantha Babu)ను ఇవాళ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనను భారీ భద్రత నడుమ పోలీసులు కాకినాడ (Kakinada)కు తరలించారు. అయితే, రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో అనంతబాబును కాకినాడకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్లో అనంతబాబును విచారించనున్నారు.
కీలక అంశాలపై ప్రశ్నలు..
హత్య జరిగిన రోజు ఏం జరిగింది..? ఆ రాత్రి సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు తీసుకువెళ్లారు? హత్యకు దారితీసిన పరిస్థితులు, ఇతర కీలక సాక్ష్యాల గురించి పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును ప్రశ్నించనున్నారు. కస్టడీ సమయంలో సేకరించిన సమాచారాన్ని పోలీసులు కోర్టుకు సమర్పించనున్నారు. ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు ఈ విచారణ అత్యంత కీలకం కానుంది.






