Games for MLAs : మూడు రోజులు ఎమ్మెల్యేలకు ‘ఆటవిడుపు’

by Thanuru Gopichand |

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులకు మార్చి 18, 19, 20 తేదీల్లో క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

Games for MLAs : మూడు రోజులు ఎమ్మెల్యేలకు ‘ఆటవిడుపు’
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ (Ap Assembly) బడ్జెట్ సమావేశాల (budjet session) సందర్భంగా శాసనసభ్యులకు (MLA) మార్చి 18, 19, 20 తేదీల్లో క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్ల పై ఆయన ఈ రోజు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్​రఘురామతో సమావేశం అయ్యారు. పురుషులకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలు, మహిళా ఎమ్మెల్యేలకు బ్యాడ్మింటన్, త్రో బాల్, టెన్నీ కాయిట్, టగ్ ఆఫ్ వార్, వంద మీటర్ల పరుగు పందెం నిర్వహించాలని నిర్ణయించారు. పాటలు, నాటకాలు, స్కిట్లు, నృత్యం, సోలో అభినయం తదితర సాంస్కృతిక కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆధ్వర్యంలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని పేర్కొన్నారు.

Next Story