వైసీపీ కోడి గుడ్డు తెస్తే.. టీడీపీ గూగుల్ ను తీసుకొచ్చింది

by velandi.Saikiran |

వైసీపీ తన ఐదేళ్ల పాలనలో కోడి గుడ్డు తెస్తే.. టీడీపీ గూగుల్ ను తీసుకొచ్చిందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.

వైసీపీ కోడి గుడ్డు తెస్తే.. టీడీపీ గూగుల్ ను తీసుకొచ్చింది
X

దిశ, ఏపీ బ్యూరో : వైసీపీ తన ఐదేళ్ల పాలనలో కోడి గుడ్డు తెస్తే.. టీడీపీ గూగుల్ ను తీసుకొచ్చిందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , విశాఖ లో గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రపంచ ప్రతిష్టాత్మక కేంద్రం రావడం, ఏఐ హబ్ గా వైజాగ్ మారిపోవడం చూసి దేశమంతా గర్వపడుతుంటే వైసిపి విమర్శలు ఎలా చేయగలుగుతోందని ప్రశ్నించారు.

ఇలాంటి గొప్ప పెట్టుబడిని దేశంలో మొట్టమొదటి సారిగా గొప్ప స్థాయిలో ఆకర్షించడం సామాన్యం కాదు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే (జమ్మూ-కశ్మీర్‌తో కలిపి) ఇలాంటి గూగుల్ డేటా హబ్ ఆంధ్రకు వెళ్లిందేంటి అని బాధపడుతున్నారు మిగతా రాష్ట్రం వారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందని మాత్రం వైసీపీ ఏడవటం చాలా బాధకరం. మనకి ఏదైనా తెలియకపోతే గూగుల్ చేస్తాం.. డేటా ఇస్తే తీసుకుంటాం. అటువంటి గూగుల్ మన రాష్ట్రానికి వస్తే ఊరు, పేరు లేని కంపెనీ వచ్చినట్లుగా ఎందుకు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా మన రాష్ట్ర యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

Next Story