నిరూపించండి.. తప్పుకుంటా: ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సవాల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-14 14:31:36  IST  )

వైసీపీ నేతలకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సవాల్ విసిరారు..

నిరూపించండి.. తప్పుకుంటా: ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా ప్రొద్దుటూరు(Proddutur)లో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి(Rachamallu Sivaprasad Reddy) ఎమ్మెల్యేగా పని చేశారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక్కడ టీడీపీ(Tdp) తరపున పోటీ చేసిన వరదరాజులరెడ్డి (Varadarajula Reddy)విజయం సాధించి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఆయనపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే ఎలాంటి పనులు చేయడంలేదని, ప్రభుత్వ పథకాలు కూడా పేదలకు అందించడంలేకపోతున్నారని ఆరోపించారు. అంతేకాదు సోషల్ మీడియాలో పలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీంతో ఆయన స్పందించారు. తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెలిపారు. తమల్ని విమర్శించే నైతికహక్కు YCPకి లేదని వరదరాజులరెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story