గూడూరును నెల్లూరు జిల్లాలో కలపండి: కేబినెట్‌ సబ్ కమిటీకి ఎమ్మెల్యే సోమిరెడ్డి లేఖ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-29 15:06:48  IST  )

గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని కేబినెట్‌ సబ్ కమిటీకి ఎమ్మెల్యే సోమిరెడ్డి లేఖ రాశారు...

గూడూరును నెల్లూరు జిల్లాలో కలపండి: కేబినెట్‌ సబ్ కమిటీకి ఎమ్మెల్యే సోమిరెడ్డి లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో పలు ప్రాంతాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. తమ ప్రాంతాలను పలానా జిల్లాలో కలపండనే విజ్ఞప్తులు వస్తున్నాయి. తాజాగా గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలనే డిమాండ్ ఊపందుకుంది. జగన్ ప్రభుత్వం గూడూరును తిరుపతి జిల్లాలో కలిపింది.

అయితే గూడూరును నెల్లూరు జిల్లాలోకి తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరుతున్నారు. గూడూరు ప్రజల విజ్ఞప్తుల మేరకు ఆయన కేబినెట్ సబ్ కమిటీకి లేఖ రాశారు. తిరుపతి జిల్లా నుంచి గూడూరును బయటకు తీసుకురావడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని తెలిపారు. గూడూరు ప్రజల అభ్యర్థన మేరకు ఆ ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రజల నుంచి వచ్చిన ఈ డిమాండ్‌పై చంద్రబాబు, లోకేశ్ హామీ ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుని ప్రజల ఆంకాంక్షను తీర్చాలని లేఖలో సోమిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Next Story