MLA Somireddy Chandramohan Reddy : కృష్ణ పట్నం పోర్టు సెక్యూరిటీ గార్డులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్

by Y. Venkata Narasimha Reddy |

ఏపీలోని కృష్ణ పట్నం పోర్టు సెక్యూరిటీ గార్డుల(Krishna Patnam port security guards)పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(MLA Somireddy Chandramohan Reddy) ప్రదర్శి్ంచిన ఆగ్రహం వైరల్ గా మారింది.

MLA Somireddy Chandramohan Reddy : కృష్ణ పట్నం పోర్టు సెక్యూరిటీ గార్డులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని కృష్ణ పట్నం పోర్టు సెక్యూరిటీ గార్డుల(Krishna Patnam port security guards)పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(MLA Somireddy Chandramohan Reddy) ప్రదర్శి్ంచిన ఆగ్రహం వైరల్ గా మారింది. కృష్ణ పట్నం పోర్టులో కొన్ని రోజులుగా నిలిచి పోయిన కంటైనర్ టెర్మినల్ పనులు నిలిచిపోయాయి. దీందో వీధిన పడ్డ ఉద్యోగుల కోసం పోర్టు సీఈవోతో మాట్లాడేందుకు టీడీపీ, బీజేపీ,జనసేన, సీపీఎం పార్టీల నేతలు పోర్టుకు వెళ్ళారు. ఈ సందర్భంగా పోర్టు సిబ్బంది మీడియాను అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాను అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పారు.

ఐనప్పటికి సెక్యూరిటీ సిబ్బంది వినిపించుకోకపోవడంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపైకి దూసుకెళ్ళి కొట్టినంత పనిచేశారు. వారిని ఆగ్రహంతో నెట్టివేశారు. నెల్లూరులో కృష్ణపట్నం టెర్మినల్ తరలింపుకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి అన్ని పార్టీలు మద్దతుతో పోరాడుతామన్నారు. 10వేల మంది ఉద్యోగాలు పోయాయని, టెర్మినల్ ను పునరుద్ధరించాలని ఆదానీని కోరుతున్నామని తెలిపారు.

Next Story