- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎక్కడికి పారిపోలేదన్నావ్.. మరి కనిపించవే: కాకాణిపై సోమిరెడ్డి సెటైర్స్
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు వేశారు..

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy)కి కేసులు భయం పట్టుకున్న విషయం తెలిసింది. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో మైనింగ్‌లో అక్రమాలు జరిగినట్లు ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మూడుసార్లు నోటీసులు జారీ చేశార. అయితే విచారణకు కాకపోవడంతో పాటు అసలు నియోజకవర్గంలోనే కనిపించడంలేదు. తొలిసారి నోటీసులు ఇచ్చిన సమయంలో మీడియా ముందుకు వచ్చి తాను ఎక్కడికి పారిపోయేవాడని కాదని కాకాణి చెప్పారు.
అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలపైనే టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఎక్కడికీ వెళ్లేవాడివి కాకపోతే పోలీసు విచారణకు హాజరుకావచ్చుగా అంటూ సలహాలు ఇస్తున్నారు. మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Former Minister and Sarvepalli MLA Somireddy Chandramohan Reddy) సైతం కాకాణిపై సెటైర్లు వేశారు. ‘‘నేను పులిని అన్నావ్, తొడ కొట్టావ్...ఇప్పుడు ఎక్కడికి పోయావు?. నేను ఎక్కడికీ పారిపోయే వాడిని కాదు అని చెప్పి ఎక్కడికి వెళ్లావు?. ఒకవేళ నువ్వు జైలుకు వెళ్తే అక్కడ నీ స్నేహితుడు వల్లభనేని వంశీ ఉంటాడు.’’ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్ వేశారు.
READ MORE ...
CM Chandrababu: వనజీవి రామయ్య మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం






