- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జైలులో కాకాణి తలకు హెయిర్ కలర్: విచారణ జరుపుతున్న అధికారులు
జైలులో కాకాణి తలకు హెయిర్ కలర్ ఉండటంపై అధికారులు విచారణ జరుపుతున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: క్వార్జ్ట్ అక్రమ తవ్వకాలు, సరఫరా కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy) అరెస్ట్ అయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే జైలులో కాకాణి గోవర్ధన్ రెడ్డి తలకు హెయిర్ కలర్ ఉండటంపై పలు అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(MLA Somireddy Chandramohan Reddy) స్పందించారు. కాకాణి రెండు నెలలుగా జైలులో ఉన్నా ఆయన జుట్టు తెల్లబడలేదన్నారు. జైలులో హెయిర్ కలర్‌కు అనుమతి ఉండదని, జైలు అధికారులు విచారణ జరుపుతున్నారని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి తప్పులు మీద తప్పుల చేశారని ఆరోపించారు. గత ఐదేళ్లలో తనపై 18 కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. మహిళా ఎమ్మెల్యేపై ప్రసన్నకుమార్ వ్యాఖ్యలు సరికాదన్నారు. అనిల్ కుమార్ అయినా సరే తప్పు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. తప్పులు చేసిన వాళ్లే కేసులు ఎదుర్కొంటున్నారని, ఎవరిపైనా ప్రభుత్వానికి కక్షలు ఉండవని సోమిరెడ్డి తెలిపారు.






