- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HHMV హిట్ అవ్వాలని కొబ్బరి కాయలు కొట్టిన ఎమ్మెల్యే
పవన్ కళ్యాణ్(Pawan kalyan) నటిస్తున్న "హరిహర వీరమల్లు"(Harihara veeramallu) సినిమా విజయవంతం కావాలని జనసేన తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు(MLA Arani Srinivasulu) కొబ్బరి కాయలు కొట్టారు.

దిశ, వెబ్ డెస్క్ : పవన్ కళ్యాణ్(Pawan kalyan) నటిస్తున్న "హరిహర వీరమల్లు"(Harihara veeramallu) సినిమా విజయవంతం కావాలని జనసేన తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు(MLA Arani Srinivasulu) కొబ్బరి కాయలు కొట్టారు. ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తిరుపతిలోని అలిపిరి మెట్ల వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. "హరిహర వీరమల్లు"(HHMV) జ్యోతి కృష్ణ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది, మొదటి భాగం "స్వార్డ్ వర్సెస్ స్పిరిట్" జులై 24న విడుదల కానుంది.
పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఐ క్రమంలో ఈ చిత్రం ఘన విజయం సాధించాలని అరణి శ్రీనివాసులు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు కోరుతూ కొబ్బరి కాయలు కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వ్యవహారంపై జనసేన కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






