- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెంటనే మొదలు పెట్టండి.. ఏపీ రాజధాని అమరావతిపై రైతుల సంచలన డిమాండ్
వైసీపీ నేతలకు ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని(Ap Capital)ని చట్టబద్ధం చేయాలని రైతుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. అంతేకాదు పార్లమెంట్ బిల్లు పెట్టి ఆమోదించాలని సూచించింది. అమరావతి(Amaravati)లో సమావేశం నిర్వహించిన రైతులు(Farmers).. తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. గత ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన మూడు రాజధానులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు సుప్రీంకోర్టులో ఉన్న కేసును వెనక్కి తీసుకోవాలని కోరారు. అలాగే ఆర్5 కేసును సైతం ఉపసంహరించుకోవాలని సూచించారు. రాజధాని రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. కొంతమంది రైతులకు వార్షిక కౌలు డబ్బులు జమ కాలేదని, ఆ సమస్యనూ పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘రాజధాని గ్రామాల్లో స్థానిక ఎన్నికలు జరిపించాలి. కుంటుపడిన మౌలిక పనులకు సీఆర్డీఏ నిధులు కేటాయించాలి. అసైన్డ్ రైతుకు ఇచ్చిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలి. రాజధాని గ్రామాల్లో అన్ని భూ సమస్యలను పరిష్కరించాలి. టిడ్కో ఇళ్ల బ్యాంకు రుణాలకు సంబంధించి వడ్డీ బకాయిలు చెల్లించాలి.’’ అని రైతుల జేఏసీ డిమాండ్ చేసింది.






