- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Raja Singh: ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఓ బుద్ధిలేని వ్యక్తి.. ఏపీ సీఎంకు రాజాసింగ్ కీలక విజ్ఞప్తి
టీడీపీ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు(MS Raju)పై తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక వీడియో విడుదల చేశారు. ఎంఎస్ రాజు ఓ బుద్ధి లేని వ్యక్తి అని, భగవద్గీతపై నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి వ్యక్తులను టీటీడీ బోర్డు మెంబర్‌గా పెట్టొచ్చా? అని సూటిగా ప్రశ్నించారు. టీటీడి బోర్డు మెంబర్‌గా నియమించేముందు ఆ వ్యక్తికి హిందూ ధర్మం పై నమ్మకం, జ్ఞానం ఉందో లేదో చూడాలని కోరారు. అలాగే ఇలాంటి వ్యక్తులు టీడీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్నారో ఒకసారి సర్వే చేయాలని చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు.
ఎంఎస్ రాజును పార్టీ నుంచి చంద్రబాబు సస్పెండ్ చేయాలని, భగవద్గీత , హిందూ ధర్మంపై మరొకరు వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ఎంఎస్ రాజు పై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబును రాజా సింగ్ డిమాండ్ చేశారు. కాగా, భగవద్గీత ప్రజల బతుకులను మార్చలేదు అని ఎంఎస్ రాజు తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే ఎంఎస్ రాజు పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.






