- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే పులివర్తిపై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక అప్‌డేట్..
చంద్రగిరి (Chandragiri) నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నాని (Pulivarthi Nani)పై హత్యాయత్నం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: చంద్రగిరి (Chandragiri) నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నాని (Pulivarthi Nani)పై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన భాను కుమార్ రెడ్డి, గణపతి రెడ్డితో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 13 మందికి తిరుపతి ఏడీజే కోర్టు వారికి రిమాండ్ విధించగా ప్రస్తుతం వారు చిత్తూరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. విచారణలో భాగంగా ఎమ్మెల్యే పులివర్తిపై దాడికి పాల్పడిన మొత్తం 37 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. సరిగ్గా ఏడాది తరువాత పోలీసులు ఇవాళ తిరుపతి కోర్టు (Tirupati Court)లో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కాగా, గతేడాది మే 14న టీడీపీ (TDP) అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ (YCP) శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లగా.. నానిపై అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) వర్గీయులు కర్రలు, ఇనప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నానితో సహా ఆయన భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి, కారు కూడా ధ్వంసమైంది.






