- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిథున్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు: వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
ఎంపీ మిథున్ రెడ్డిని చంద్రబాబు, లోకేశ్ ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఎంపీ మిథున్ రెడ్డి(Mp Mithun Reddy)ని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu), మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ఇబ్బంది పెడుతున్నారని, ఇది మంచిది కాదని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్(MLA Peddireddy Dwarakanath) అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మిథున్ రెడ్డితో ములాఖత్ అయ్యారు.
ఈ సందర్భంగా ద్వారకానాథ్ మాట్లాడుతూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సంబంధించిన ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. జైల్లో సౌకర్యాల కల్పనపై కోర్టు ఆర్డర్ ఉన్నా.. ప్రతిదాంట్లో వేలుపెట్టి ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యానించారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలనేదే చంద్రబాబు ఆలోచన అని మండిపడ్డారు. ఏ తప్పు చేయకుండానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. ములాఖత్‌లో మిథున్ రెడ్డి మాట్లాడాలంటే పక్కనే నలుగురు పోలీసులు వచ్చి నిలబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేశ్ మాదిరిగా తాము మోసాలతో పైకి రాలేదన్నారు. తమపై కక్ష సాధింపులకు పాల్పడుతున్న వారిని ఆ దేవుడే చూసుకుంటారని పెద్దిరెడ్డి ద్వారకానాథ్ వార్నింగ్ ఇచ్చారు.






