- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిందూపురంలో బాలయ్య సొంత నివాసం.. సతీమణితో కలిసి భూమి పూజ
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య తన నియోజకవర్గంలో సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు....

X
దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య(Hindupur MLA Nandamuri Balayya) తన నియోజకవర్గంలో సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఈ మేరకు సతీమణి వసుంధరతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నందమూరి బాలయ్య హిందూపురం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
సొంత నివాసం లేకపోవడంతో..
అయితే సొంత నివాసం లేకపోవడంతో ప్రతిపక్ష పార్టీ నాయకుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలో సొంత ఇల్లు నిర్మించుకోవాలని బాలయ్య నిర్ణయించారు. శాశ్వతంగా ఇక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు హిందూపురం సమీపంలోని వన్నమ్మ కాలనీ వద్ద 81 సెంట్ల విస్తీర్ణంలో భవన నిర్మాణానికి స్థలం కొనుగోలు చేసి సొంత ఇల్లును నిర్మించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. తాజాగా భూమి పూజ చేయడంతో ఇక నిర్మాణ పనులు పుంజుకోనున్నాయని తెలుస్తోంది.
Next Story






